Tirumala Srivari Teppotsavam 2025 : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు నుంచి పౌర్ణమి వరకు జరుగుతాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయ పుష్కరిణిలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. అనంతరం ఆలయ మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది.