¡Sorpréndeme!

సఖి నివాస్: తక్కువ ధరకే మహిళలకు హాస్టల్

2025-03-08 4 Dailymotion

SAKHI NIWAS HOSTELS: యువతులు, విద్యార్థినులు ఊరి దాటి బయట అడుగుపెట్టాలంటే భద్రత ప్రధాన సమస్య. నగరాల్లో ఉంటూ ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా వసతిగృహాలకు వేలకువేలు చెల్లించాల్సిందే. అతివలు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలకు చెక్‌ పెడుతూ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లను మహిళా శిశు సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. సఖినివాస్ పేరిట ఏర్పాటు చేసిన వసతి గృహం గుంటూరులో త్వరలో అందుబాటులోకి రానుంది. సఖి నివాస్‌లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఉపయోగాలపై మహిళా దినోత్సవ వేళ ప్రత్యేక కథనం.