Singer Kalpana Released Video on Her Health Condition : అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆమె తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. పని ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందువల్ల ట్యాబ్లెట్లు ఎక్కువ డోస్‌లో తీసుకున్న కారణంగా తనకు ఇలా అయిందని తెలిపారు.