¡Sorpréndeme!

రాష్ట్రంలో భానుడి భగభగలు - ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ - ఆ సమయంలో బయటకు రావొద్దు

2025-03-05 3 Dailymotion

Telangana Weather News : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకున్నాయి. దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల చివరి రెండు వారాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీస్తాయన్నారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.