Police destroy illegal liquor in Konaseema District : అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డివిజన్ పరిధిలోని ఏడు పోలీస్ స్టేషన్లకు సంబంధించి 90 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ సుంకర మురళీమోహన్ తెలిపారు. అంబాజీపేట మార్కెట్ యార్డులో మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. గత ఆరేళ్లుగా ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 2వేల 700 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ సుంకర మురళీమోహన్ వెల్లడించారు.