Tirumala Ghee Case Updates : తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన నిందితుల్లో ఇద్దరిని రెండోసారి సిట్ కస్టడీకి అనుమతిస్తూ తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కల్తీ నెయ్యి కేసులో ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖరన్ అరెస్టయ్యారు.