25 Percent Rebate IN LRS Fee : సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లోఉన్న లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) అమలులో వేగంపెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన మంత్రుల కమిటీ 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేందుకు నిర్దేశించిన మొత్తాన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించాలని పేర్కొంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు.