BRS Party Meeting : రాష్ట్రంలో ఏడాదిపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు జరపాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను చైతన్యపరుస్తూ రాష్ట్రం, ప్రజలకు శాశ్వత విజయం దక్కేలా పాతికేళ్ల స్ఫూర్తితో పనిచేయాలని నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిషయాల్లో పూర్తిగా విఫలమైందన్న కేసీఆర్ గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికలు ఖాయమని మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనతో అవకాశాలు పెరుగుతాయని నేతలకి సూచించారు