Hydra Focus On Revival Of Ponds In Hyderabad : హైదరాబాద్‌లో చెరువుల పునరుద్దరణలో హైడ్రా మరో ముందడుగు వేసింది. తొలి దశలో నగరంలోని 6 చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు చర్యలుచేపట్టింది. సుమారు 150 నుంచి 200 కోట్లతో ఆ చెరువులను సమీప ప్రజలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన హైడ్రా జులై నాటికి పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తోంది.