¡Sorpréndeme!

అమ్మ బాబోయ్ పెద్దపులి - కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న ప్రజలు

2025-02-19 8 Dailymotion

Tiger Spotted in Bhupalpally Dist : తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహాదేవపూర్, కాటారం ప్రాంతాల్లో పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత పది రోజుల క్రితం కాటారం మండలం నస్తురుపల్లి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి పులిని చూసి స్థానికులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు దాని పాద ముద్రలను గుర్తించి పులి జాడ కోసం ఎంతగా అన్వేషిస్తున్నా జాడ కనిపించలేదు. తాజాగా బుధవారం మహాదేవపూర్ మండలం పలువుల గ్రామంలో ఎస్సీ కాలనీలో పులి సంచారంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.