Illegal Transportation of Ganja : తెలంగాణ ఛత్తీస్గడ్ ఒడిశా సరిహద్ద ప్రాంతం కావడంతో భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణా దారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.