CM Chandrababu Visit to Kandukur: ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, దూబగుంటలో గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.