Tirumala Ratha Saptami : జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీంతో దేవాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తిరుమలలో ఈ వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. ఇవాళ సప్త వాహనాలపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు.