¡Sorpréndeme!

పోలీసుల అదుపులో హిందూపురం వీఆర్వో, సర్వేయర్‌

2025-02-01 9 Dailymotion

Police Arrested Hindupur VRO and Surveyor : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంకి చెందిన వీఆర్వో, సర్వేయర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్​కు సంబంధించిన భూమిని కబ్జా చేసి నకిలీ ఇంటి పట్టాలు సృష్టించి తమకు విక్రయించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా నకిలీ పత్రాలతో 17 మందికి ప్లాట్లు అమ్మినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో వీఆర్వో రామ్మోహన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. అనంతరం వీఆర్వో రామ్మోహన్, సర్వేయర్‌ శ్రీనివాసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.