Central Minister Visit To Visakha Steel Plant Today : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన కేంద్రం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. నేడు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్లాంటులో పర్యటించనున్నారు. నిర్వహణపై అధికారులతో సమీక్షించడంతోపాటు, కార్మిక సంఘాలతో సమావేశం అవుతారు.