Revenue Minister Anagani Satya Prasad On Simhachalam Land issue : సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు రూ.5,300 కోట్ల విలువైన భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. మొత్తం 12,149 ఇళ్లను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా అంగీకారం తెలిపారని చెప్పారు. 2016-17 ధరలకే 70 వేల మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆ తేదీల నుంచే క్రమబద్ధీకరణ వర్తించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు.