BRS Working President KTR Dharna At Nalgonda : స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుపట్ల కపట ప్రేమ చూపుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణుల ఘన స్వాగతానికి అబ్బురపడిపోయారు. మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలా బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రామ్‌రామ్ అంటారని ఆనాడే చెప్పామని కేటీఆర్ స్పష్టం చేశారు. మహా ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.