KTR Slams to TG Govt : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు అహ నా పెళ్లంటా సినిమాలో కోడిని వేలాడదీసి చికెన్ తినాలని చెప్పినట్లే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం క్యాలెండర్ను ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. వంద రోజుల్లోనే ఆరు నూరైనా 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, సీనియర్ ఎన్టీఆర్ తరహాలో డైలాగులు కొట్టారని ఆక్షేపించారు. రైతుభరోసా విషయంలో సీఎం నిన్న(జనవరి 25న) 15 నిమిషాల్లో మాట మార్చారని, అపరిచితుడు సినిమాలో రాము, రెమోలా మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.