Union Minister Bandi on Ration Cards : రాష్ట్రప్రభుత్వ విధానాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మరోసారి భగ్గుమన్నారు. కేంద్రం నిధులతో ఇచ్చే పథకాలకు ఆ పార్టీ నేతల పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. పీఎం ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇండ్లకు ‘ఇందిరమ్మ ’ పేరు పేడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అలాగే కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోందని, అందువల్ల రేషన్ కార్డులపై ప్రధాని చిత్రం తప్పనిసరి సరిగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకుంటే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.