Youth Spending and Taking Loans For Wedding : పెళ్లంటే పందిళ్లు, సందళ్లు తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు అన్నది ఒకప్పటి పద్ధతి. ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, హల్దీ కార్యక్రమాలు, ఖరీదైన ఫంక్షన్ హాళ్లు, లెక్కకు మిక్కిలి వంటకాలు ఇదీ ఇప్పటి పద్ధతి. వెరసి ఇప్పుడు పెళ్లంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. దీనికి తోడు పెళ్లి విషయంలో పిల్లలదే పెత్తనం కావడం వారి అభీష్టాలను తల్లిదండ్రులు, కుటుంబీకులు గౌరవించక తప్పని పరిస్థితి నెలకొనడంతో వివాహ సగటు ఖర్చు ఓ భారీ సినిమా బడ్జెట్‌ను తలపిస్తోంది. ఒకరిని చూసి మరొకరు తాహతుకు మించి ఖర్చు చేస్తూ కష్టాల్లో కూరుకుపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు పెళ్లి చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.