¡Sorpréndeme!

230 కేజీల భారీ మొసలి - ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు

2025-01-22 1 Dailymotion

Huge Crocodile in Wanaparthy : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో భారీ మొసలి కలకలం సృష్టించింది. ఓ ఇంటి ముందున్న సీతాఫలం చెట్టు వద్ద మొసలి ప్రత్యక్షమైంది. ముందగా కవిత అనే మహిళ వెళ్లి చూడగా చెట్టు పొదల్లో భారీ మొసలి కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేస్తూ పరుగెత్తింది. దీంతో గ్రామస్థులు అక్కడకు వెళ్లి చూడగా భారీ మొసలి పాకులాడుతూ కనిపించింది. వెంటనే అక్కడి స్థానికుల స్నేక్ సొసైటీ నిర్వాహకులు అయిన కృష్ణ సాగర్​కు సమాచారం ఇవ్వడంతో ఆయన అటవీ శాఖ అధికారులతో కలిసి దాదాపు 11 ఫీట్ల పొడవు 230 కిలోల బరువున్న భారీ ముసలిని తాళ్లతో బంధించారు.