¡Sorpréndeme!

ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే కాదు మొత్తం ఇండస్ట్రీపై జరుగుతున్నాయి : దిల్‌ రాజు

2025-01-22 0 Dailymotion

IT Raids on Film Producer Dil Raju Office : హైదరాబాద్‌ నగరంలో సినీ ప్రముఖుల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో 55 ఐటీ బృందాలతో మొదలైన ఈ తనిఖీలు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 'సంక్రాంతికి వస్తున్నాం', 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాల నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దిల్‌ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఐటీ సోదాలపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపై జరగడం లేదని, ఇండస్ట్రీపై మొత్తం జరుగుతున్నాయని అన్నారు.