Minister Dola Fires on YSRCP : విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. జగన్‌లా తాము కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజాధనం దుర్వినియోగం చేయమని చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమతో కలిసి ఆయన స్మృతి వనాన్ని పరిశీలించారు.