CM Chandrababu Mydukur Tour : స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతోనూ ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇకపై ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు.