¡Sorpréndeme!

నిజామాబాద్​లో పసుపు బోర్డు వచ్చేసింది

2025-01-14 4 Dailymotion

Union Minister Piyush Goyal Launch Turmeric Board : నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్‌ కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి పీయూష్‌ మాట్లాడుతూ సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రపంచంలో భారత్‌కు గొప్ప పేరు ఉందని, నాణ్యమైన పంట పండించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.