CM Chandrababu Family At Naravaripalli in Chittoor District : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబసభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.