TURMERIC Board In Nizamabad : నిజామాబాద్ జిల్లా రైతుల నిరీక్షణకు ఎట్టకేలకు ఫలించింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు.