TRAFFIC JAM ON VIJAYAWADA HIGHWAY : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకొనేందుకు సొంత ఊళ్లకు నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్‌మెట్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్‌రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఔటర్‌పై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.