Tirumala Vaikunta Ekadashi 2025 : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల ఉత్తర ద్వారం దర్శనాలకు ముస్తాబైంది. ఇందుకోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. పోలీసు, విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ నెల 10 నుంచి 19 వరకు ఏడు లక్షల మందికి ఉత్తర ద్వార దర్శనం కల్పించేలా ఇప్పటికే ఆన్లైన్లో కొన్ని టిక్కెట్లు విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వ దర్శన టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ చేపట్టనుంది.