APPSC Group 1 Mains Ratio Issue : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు ఎపీపీఎస్సీని కోరుతున్నారు. గత ప్రభుత్వం పరీక్ష నిర్వహించిన విధానంలో లోపాలు, సిలబస్‌లో మార్పులు, ఎన్నికలు సమయంలో పరీక్షల నిర్వహణ వల్ల తాము నష్టోయామని న్యాయం చేయాలని కోరుతున్నారు. పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్దం కాలేక ప్రిలిమ్స్‌కు అర్హత సాధించలేకపోయామి, ఎంపిక నిష్పత్తి పెంచి తమకు ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తద్వారా గ్రూప్ 1 ఉద్యోగం సాధించాలన్న కల నెరవేర్చేలా సహకరించాలని విన్నవిస్తున్నారు.