Telangana Crime News : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్, బీబీపేటలో కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వీరు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ ఫోన్లతోపాటు ఎస్సై కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు అనుమానించారు. దీంతో బుధవారం రాత్రి గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.