¡Sorpréndeme!

మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై అధికారుల నివేదిక

2024-12-24 13 Dailymotion

AP Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 2000ల బస్సులతో పాటు, 11 వేల 500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ఎంత రాబడి తగ్గుతుంది, ఏయే బస్సులకు డిమాండ్‌ ఏర్పడుతుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను సర్కార్​కి అందజేశారు.