Minister Seethakka Comments On Bad Movies : సమాజంలో సినిమాల పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. చెడు సినిమాల వల్ల సమాజం అక్రమ మార్గాల్లోకి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా లీలా గార్డెన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.