Vijayawada Book Fair 2025 : విజయవాడ పుస్తక మహోత్సవం మూడున్నర దశాబ్దాల మైలురాయిని ఘనంగా దాటనుంది. ఏటా సంక్రాంతికి ముందు జరిగే అతిపెద్ద పండగ పుస్తక మహోత్సవమే. ఈ ఏడాది 35వ పుస్తక మహోత్సవానికి పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. దీనికి నగరం మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వేదిక కావడంతో నిర్వాహకులు, పుస్తక ప్రియుల్లోనూ నూతనోత్సాహం సంతరించుకుంది. ఇప్పటికే 200కు పైగా ప్రచురణ సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం.