Minister Komatireddy On Attack On Allu Arjun House : సంధ్య థియేటర్లో జరిగిన ఘటన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలను చేసి రాద్ధాంతం చేయడం మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పుష్ప సినీ నిర్మాత నవీన్‌తో కలసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మైత్రి మూవీ క్రియేషన్స్ తరఫున నిర్మాత నవీన్, శ్రీతేజ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై ఆయన స్పందించారు.