Allu arjun On Sandhya Theatre Incident : సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట గురించి మరుసటిరోజు ఉదయం వరకు నాకు తెలియదన్నారు హీరో అల్లు అర్జున్. పోలీసుల అనుమతి ఉంటేనే తాను ఆరోజు థియేటర్‌కు వెళ్లానని.. అక్కడ థియేటర్ ముందు రోడ్ షో చేయలేదని స్పష్టం చేశారు. థియేటర్‌లోకి వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం మాత్రమే కారు ఆగిందని.. అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ ముందుకు వెళ్లామన్నారు. థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత తనతో ఎవరూ ఏమీ చెప్పలేదని, పోలీసులు వచ్చి జనం అధికంగా గుమికూడారని, వెళ్లమని చెప్తే వెళ్లిపోయానని మీడియా సమావేశంలో తెలిపారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని స్పష్టం చేశారు.