Fake Police Gang Looted Rs. 25.5 Lakh From Gold Merchant : అతడు పలు వ్యాపారాలు చేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. తీర అన్నింట్లో నష్టపోయి నేరాల బాట పట్టాడు. ఎవరెవరు చెన్నై గోల్డ్ మార్కెట్ కు వెళ్తారో నిఘా పెట్టాడు. ట్రైన్ టికెట్ ద్వారా తెలుసుకుని వారి వివరాలు తెలుసుకొని లక్షల రూపాయలను దోచేసే స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం నకిలీ పోలీసుల ముసుగులో ఏకంగా రూ. 25.5 లక్షలు దోచేశాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులే నిర్ఘాంత పోయేలా చేసిన ఈ ఘటన విజయవాడలో వెలుగుచూసింది.