¡Sorpréndeme!

ఫార్ములా ఈ కార్​ రేసింగ్ వ్యవహారం - ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి

2024-12-20 2 Dailymotion

CM Revanth Reddy On Formula E car Race : రూ.55కోట్లు కాదు రూ.600 కోట్లు దోచిపెట్టేందుకు ఫార్ములా ఈ- రేస్‌ నిర్వహకులతో మాజీ మంత్రి కేటీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. రేసింగ్‌ నిర్వహకులు వచ్చి తనతో సమావేశం కావడం వల్లే అసలు విషయం వెలుగుచూసిందని తెలిపారు. మంత్రివర్గం, ఆర్‌బీఐ అనుమతి లేకుండానే పౌండ్స్‌ రూపంలో చెల్లించారన్న రేవంత్‌రెడ్డి అక్రమాల బాగోతాన్ని నిగ్గుతేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. నాలుగుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఫార్ములా ఈ రేసింగ్‌పై చర్చించాలని బీఆర్ఎస్ ఎందుకు పట్టుపట్టలేదన్న ఆయన ఈ కార్‌ రేసింగ్‌పై ఏసీబీ విచారణ కొనసాగటం, హైకోర్టులో విచారణ జరుగుతున్నందునే తాను ఎక్కువగా మాట్లాడటం లేదని అన్నారు.