¡Sorpréndeme!

'పర్యాటకరంగంలో 25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం'

2024-12-17 3 Dailymotion

MINISTER KANDULA DURGESH ON TOURISM POLICY: రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందివ్వడం సహా లాభాలను తీసుకువచ్చేలా భవిష్యత్తుపై భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విజయవాడలో పారిశ్రామిక వేత్తల సదస్సు ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఎపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.