Deputy CM Pawan Kalyan Meets Hindupur Former Naveen : 'ఈటీవీ భారత్' కథనానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి మంగళగిరికి ఎడ్లబండిలో వచ్చి తనను కలిసేందుకు నిరీక్షించిన నవీన్ అనే యువరైతును పవన్ కల్యాణ్ కలిశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్న పవన్ కల్యాణ్ రోడ్డు పక్కనే ఉన్న రైతుని కలిశారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ రైతును అడగగా పండించిన పంటకు గిట్టుబాటు దొరకటం లేదని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు.