Conservation of Telugu in Guntur: పర భాషల వ్యామోహంలో పడి తెలుగుకు తెగులు పట్టించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. నేటి తరానికైతే చాలా తెలుగు పదాలు తెలీదనడంలో ఎటువంటి అకతిశయోక్తి లేదు. ఏదైనా పదం చెబితే మాకు తెలీదని అదేదో గొప్పగా చెబుతారు. పిల్లలే కాదు పెద్దలు సైతం కన్నతల్లిలాంటి భాషను విస్మరించడంతో మరుగున పడే ప్రమాదం ఉంది. మాతృభాష చిన్నబోతోందని గుర్తించిన ఓ భాషాభిమాని తెలుగుకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాన్ని వారధిగా మలచుకుని తెలుగు పద్యాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాడు. తనకు తెలిసిన విద్యను వందలాది మందికి నేర్పిస్తూ తెలుగు భాషాభివృద్ధికై పాటుపడుతున్నాడు.