¡Sorpréndeme!

'చిత్తశుద్ధితో గురుకులాల ప్రక్షాళన - ప్రతి నెల 10లోపు విద్యా సంస్థలకు నిధులు'

2024-12-14 0 Dailymotion

CM Revanth Common Diet : 'ఇటీవలే గురుకులాల డైట్​ ఛార్జీలు పెంచాం. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు గురుకులాల విద్యార్థుల కంటే ఎక్కువనే భావన ఉంది. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలి. గురుకులాల వ్యవస్థను పీవీ నరసింహారావు హయాంలో తీసుకొచ్చారు. టీజీపీఎస్సీ ఛైర్మన్​ బుర్రా వెంకటేశం ఒకప్పటి గురుకుల విద్యార్థే. మాజీ డీజీపీ మహేందర్​ రెడ్డి కూడా గురుకులాల విద్యార్థే. గురుకులాల విద్యార్థులు ఎందరో ఉన్నతస్థాయికి వెళ్లారు.' అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సీఎం రేవంత్​ రెడ్డి సందర్శించారు. అనంతరం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్​ డైట్​ను ప్రారంభించారు.