Hydra Commissioner in Pedda Amberpet : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌లోని కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా జరుగుతుందన్న ఆరోపణలపై స్పందించిన హైడ్రా అధికారులు నిన్నటి నుంచి సర్వే ప్రారంభించారు. హైడ్రా అధికారులు సర్వే చేస్తున్న కుంట్లూర్ పెద్ద చెరువు స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు పరీశీలించారు. ఈ కుంట్లూర్ చెరువులో ఏకంగా మున్సిపల్ శాఖ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కమిషనర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.