Margadarshi 119 Branch Open : విశ్వసనీయతకు మారుపేరు.. నమ్మకానికి అమ్మ వంటి మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తన 119వ బ్రాంచ్‌ను కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభించింది. బెంగళూరులోని కెంగేరిలో మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి.. పూజలు చేశారు. అనంతరం ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు. బ్రాంచ్ మొదటి కస్టమర్ నుంచి చిట్ కట్టించుకున్నారు. బ్రాంచ్‌లో ఉద్యోగులతో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ సరదాగా గడిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త శాఖలు ప్రారంభించనున్న సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.