'రేషన్ బియ్యం స్మగ్లింగ్' రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారిన అంశం. ఓ వైపు చౌక బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నాపాతాళం వరకు పాతుకుపోయిన మాఫియా మాత్రం అసలు లెక్కచేయడం లేదు. మిల్లుల్లో అక్రమంగా ఉంచిన బియ్యం నిల్వలను అధికారుల కళ్లుగప్పి బోర్డర్ దాటించేస్తున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో రూటు మార్చిన బియ్యం దొంగలు విశాఖ పోర్టును అడ్డాగా మార్చుకున్నారు. తాజాగా కంటెయినర్‌లో 483 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడటం అక్రమాలకు అద్దం పడుతోంది.