Police Solved Student Murder Case In 48 Hours In Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థి హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కేసు పరిష్కారంలో కీలకంగా వ్యవహారించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రత్న రివార్డులను అందించారు. ఈ సందర్భంగా హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వి. రత్న మీడియాకు వెల్లడించారు "మడకశిర మండలం ఆమిదాలగొంది Z.P హైస్కూల్లో చైతన్యకుమార్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. చైతన్య తల్లి పుష్పలతపై వ్యామోహం పెంచుకున్న అశోక్ అనే యువకుడు నిత్యం వేధించేవాడు. అయితే పుష్పలత అశోక్ అక్రమ సంబంధాన్ని నిరాకరించి పెద్దలకు చెప్పింది. దీంతో పెద్దలు అశోక్‌ను మందలించారు. అప్పటి నుంచి అశోక్ పుష్పలతపై కక్ష పెంచుకున్నాడు.