రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే 54 వేల 280 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 27 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులకు 17 వేల 870 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు తెలిపింది. పంటల బీమాకు 1300 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ఈ సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటి వరకు 5 వేల కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది