¡Sorpréndeme!

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్

2024-11-26 4 Dailymotion

KTR Comments On Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అంటూ పిచ్చి నివేదిక విడుదల చేశారన్నారు. అవగాహనా రాహిత్యంతో సీఎం మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. అదానీతో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు.