¡Sorpréndeme!

'సర్వే చేయడానికి మీ ఇళ్లకు రాను - మీరే పంచాయతీ కార్యాలయానికి రండి'

2024-11-19 7 Dailymotion

Samagra Kutumba Survey at Panchayat Office : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కొందరు మాత్రం ఆదేశాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో, కాలనీల్లో ఒక దగ్గర ఉంటూ సర్వేలు చేపడుతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే సర్వే చేశారు. అక్కడి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తూ, గ్రామస్థులను అక్కడికే పిలుపించుకుని సభ్యుల వివరాలు అడిగి ఫారాల్లో నింపుతూ సర్వే చేశారు. పంచాయతీ కార్యాలయంలోనే సర్వే చేస్తున్నారని తెలిసి అక్కడికి గ్రామస్థులు పరుగులు పెట్టారు.