Malla Reddy in another land Dispute : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. దగ్గరి చుట్టమే కదా అని నమ్మితే మల్లారెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని దోమలగూడకు చెందిన 87 ఏళ్ల వృద్ధ రైతు కళ్లెం నర్సింహా రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నాడు. మల్లారెడ్డి నుంచి తనకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.